ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు.. మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం

చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయంలో సీఎంగాబాధ్యతలు స్వీకరించారు.  వెలగపూడి సచివాలయానికి చేరుకున్న చంద్రబాబు దంపతులకు  వేద మంత్రాలతో  స్వాగతం పలికారు. ఐదేళ్ల తరువాత చంద్రబాబు సచివాలయంలో అడుగు పెట్టారు.  ఆయన వెంట అచ్చంనాయుడు,   కొల్లు రవీంధ్ర, పయ్యావుల కేశవులు ఉన్నారు. 

వెలగపూడి సచివాలయంలో పూజలు.. వేద మంత్రాల మధ్య చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు.  మెగా డీఎస్సీ మొదటి  ఫైలుపై సంతకం చేశారు.  ఇక రెండో సంతకాన్ని  ల్యాండ్​ టైటిలింగ్​ యాక్ట్​ రద్దుపై చేశారు.  మూడో సంతకం.. పింఛన్​ రూ. 4 వేలకు పెంచుతూ..  నాలుగో సంతకం.. అన్నా క్యాంటిన్లు పునరుద్దరణ.. ఐదో సంతకం.. స్కిల్​ సెన్స​ పై  సంతకాలు చేశారు.పింఛన్​ను రూ. 4 వేలకు పెంచే ఫైలుపై సంతకం చేసే సమయంలో ఆయన వద్ద దివ్యాంగులు, వృద్దులు ఉన్నారు.